Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో పోలీసుల గదిని శుభ్రం చేసిన ఏడేళ్ల చిన్నారి: విచారణకు కలెక్టర్ ఆదేశం

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించే కేంద్రంలో చిన్నారితో గదిని శుభ్రం చేయించారు. పోలీసులు దగ్గరుండి చిన్నారితో ఈ పనులు చేయించడం గమనార్హం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Nellore collector orders to enquiry on seven year old girl cleaning police room
Author
Nellore, First Published May 18, 2020, 12:50 PM IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించే కేంద్రంలో చిన్నారితో గదిని శుభ్రం చేయించారు. పోలీసులు దగ్గరుండి చిన్నారితో ఈ పనులు చేయించడం గమనార్హం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఈ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుగా నియమించారు. పోలీసులకు కేటాయించిన గదిలో దుమ్ముతో నిండిపోయింది.

ఈ గదిని క్లీన్ చేయాలని ఇక్కడ వాచ్ మెన్ గా పనిచేసే వ్యక్తి భార్యకు చెప్పారు. అయితే ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో ఏడేళ్ల చిన్నారితో ఈ గదిని క్లీన్ చేయించారు. 

also read:స్వదేశీ వస్తువులే కొనుగోలుకు ఆదేశాలివ్వండి: ఏపీ హైకోర్టులో బీజేపీ నేత పిటిషన్

ఈ విషయం మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. కలెక్టర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ స్థానిక సీఐను విచారణను ప్రారంభించారు. మరో వైపు ఏడేళ్ల చిన్నారితో గదిని శుభ్రం చేయించిన కానిస్టేబుళ్లపై కూడ ఎస్పీ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios