అమరావతి:స్వదేశీ, విదేశీ వస్తువుల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలైంది. స్వదేశీ వస్తువులను వాడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని  బీజేపీ నేత అమర్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ క్రమంలోనే మేకిన్ ఇండియాను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలను ప్రారంభించింది.

also read:ఏపీలో లాక్ డౌన్ మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

మేకిన్ ఇండియా వస్తువులే వాడాలన్న ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ, విదేశీ వస్తువుల అమ్మకాలపై  పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేత. స్వదేశీ వస్తువులు ప్రజలకు తెలిసేలా ఒక రంగును వేయాలని కూడ ఆయన పిటిషన్ లో కోరారు. 

అంతేకాదు స్వదేశీ వస్తువులు కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌దారుడు కోరారు. ఈ పిటిషన్   మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపుగా రెండు మాసాల నుండి దేశ వ్యాప్తంగా పరిశ్రమలు మూతపడ్డాయి.వస్తువుల తయారీ కూడ నిలిచిపోయింది.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ పై ఆంక్షల్లో సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.