Asianet News TeluguAsianet News Telugu

విషాదం : ఐదు నెలలు మృత్యువుతో పోరాడి.. నెల్లూరు యాసిడ్ దాడి బాధితురాలు మృతి..

మేనమామ చేతిలో యాసిడ్ దాడికి గురైన 14యేళ్ల బాలిక మృత్యువుతో పోరాడుతూ 5 నెలల తరువాత మంగళవారం మృతి చెందింది. 

Nellore acid attack victim dies after fighting with death for five months, andhra pradesh - bsb
Author
First Published Feb 1, 2023, 7:30 AM IST

నెల్లూరు : నిరుడు సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మైనర్ బాలికపై యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలు మంగళవారం మృతి చెందింది. యాసిడ్ దాడికి గురైన ఓ బాలిక మృత్యువుతో పోరాడుతూ ఐదు నెలల తర్వాత మృతి చెందింది. అత్యాచారానికి నిరాకరించడంతో ఆమె నోట్లో యాసిడ్ పోసి దాడికి దిగిన ఘటన నిరుడు సెప్టెంబర్ లో శ్రీపొట్టి  శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దాడి 14 ఏళ్ల బాలికపై ఆమెకు మేనమామ వరుసయ్యే వ్యక్తి చేశాడు. దీంతో ఆ చిన్నారి విలవిల్లాడిపోయింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కి మొదట ఓ కుమారుడు పుట్టాడు. అతను 18 ఏళ్ల వయసులో చనిపోయాడు.

ఆ తర్వాత పిల్లల కోసం వారు చాలా ప్రయత్నాలు చేయగా చాలా కాలానికి కూతురు పుట్టింది..లేక లేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. నిరుడు సెప్టెంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులందరూ ఏదో పనిమీద నెల్లూరుకు వెళ్లారు. 14 ఏళ్ల ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. మేనమామ వరసయ్యే ఓ వ్యక్తి ఇది గమనించాడు. ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అనుకోని ఈ ఘటనకు షాక్ అయిన బాధితురాలు అతని నుంచి తప్పించుకొని, బయటికి పారిపోయింది.

బాలికపై యాసిడ్ దాడి చేసింది మేనమామే... డబ్బుకోసమే ఘాతుకం....

బాత్రూంలో దాక్కుంది. అయినా ఆమెను వెంటాడి, వేధించిన కామాంధుడు.. బాత్రూం తలుపులు పగలగొట్టి.. ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేయబోయాడు. బాధితురాలు కేకలు వేస్తుండడంతో.. ఆమెను ఆపడం కోసం అక్కడే ఉన్న ఆసిడ్ బాటిల్ తీసుకొని ఆమె నోట్లో పోసాడు. దీంతో ఆ బాలిక విలువిల్లాడిపోయింది. ఇది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు బాలికను గమనించి.. వెంటనే మొదట నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం.. చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరులో యాసిడ్ దాడికి గురైన 9వ తరగతి విద్యార్ధిని: చెన్పై అపోలో ఆసుపత్రికి తరలింపు

అక్కడ ఐదు నెలలుగా చికిత్స పొందుతుంది. డాక్టర్లు రెండు రోజుల క్రితం బాలికను  పరీక్షించి.. రెండు నెలల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని.. దీంతో ముఖం పాత స్థితికి వస్తుందని చెప్పారు.  దీంతో బాలిక బతుకుతుంది అని తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే రెండు రోజుల్లో వారి కలలు ఆవిరయ్యాయి. ఐదు నెలలుగా మృత్యువుతో పోరాడి  మంగళవారం బాధితురాలు మృతి చెందింది.  దీనిమీద నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పంచనామ కోసం బుధవారం చెన్నైకి పోలీసులు వెళ్లనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios