విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు లాకౌటైంది. తెల్లవారుజామున 4 గంటలకు మిల్లు యజమాన్యం లాకౌట్‌ను ప్రకటించింది. లాకౌట్ కారణంగా ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న 3 వేలమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు లాకౌట్‌కు వ్యతిరేకంగా మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.