నీట్-2018 రిజల్ట్స్ విడుదల: కల్పనా కుమారి ఆలిండియా టాపర్

NEET Result 2018 Declared; More Than 7   Lakh Qualify
Highlights

నీట్- 2018 రిజల్ట్స్

న్యూఢిల్లీ: నీట్ -2018  ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం
నాడు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా సుమారు 13 లక్షలల
మంది పరీక్షలు రాస్తే 7 లక్షల మంది క్వాలిఫై అయ్యారు.

నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 7 లక్షల మందిలో సుమారు
6.3లక్షల మంది జనరల్ కేటగిరికి చెందినవారే ఉన్నారు.

నీట్ ఫలితాలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
దాఖలైన నేపథ్యంలో నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఒక్క
రోజు ముందుగానే వెల్లడించారు. 

నీట్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా కల్పనాకుమారి
నిలిచారు. 720 మార్కులకు గాను కల్పనా కుమారికి 690
మార్కులులభించాయి. 99.99 శాతం మార్కులతో ఆమె
టాపర్ గా నిలిచింది.

నీట్ లో క్వాలిఫై అయిన అభ్యర్ధులు ఆన్ లైన్   కౌన్సిలింగ్
కోసం  తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

నీట్ ఫలితాల కోసం  ఫలితాల కోసం cbseneet.nic.in,
cbseresults.nic.inను క్లిక్‌ చేయవచ్చు. 

loader