న్యూఢిల్లీ:  ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

మంగళవారం నాడు రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.ఏపీ విభజన సమయంలో  ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలో కొన్ని అంశాలను పొందుపర్చినట్టు ఆయన గుర్తు చేశారు.

తొలుత కర్నూల్, ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హైద్రాబాద్ రాజధానిలో ఉన్నట్టు ఆయన చెప్పారు.హైద్రాబాద్‌ను  అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో  తన పాత్రగా ఉందన్నారు. రాష్ట్ర విభజన  తర్వాత అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన్టు చెప్పారు.

ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను  ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏపీ ప్రజల జీవితాలతో బీజేపీ ఆడుకొంటుందన్నారు.  విభజన హామీలను అమలు చేస్తామని మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. కానీ, ఎన్నికల తర్వాత ఈ హామీలను విస్మరించిందని ఆయన చెప్పారు.

విభజించి పాలించే సూత్రాన్ని మోడీ  అమలు చేస్తున్నారని  బాబు చెప్పారు. తమను అవమానించేందుకు మోడీకి ఎలాంటి హక్కు లేదన్నారు.  దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు వల్లభాయ్ పటేల్  ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోడీకి లేదన్నారు.

రాష్ట్రపతికి అన్ని విషయాలను వివరించినట్టు చెప్పారు. తమకు రాష్ట్రపతి న్యాయం చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే తాము ప్రజా క్షేత్రంలో  బీజేపీ సంగతి తేలుస్తామన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ మొత్తం ఢిల్లీ వీధుల్లో...: పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు