తెలుగుదేదశంపార్టీ వైఖరిని జాతీయ మీడియా దుమ్ము దులిపేసింది. అవిశ్వాస తీర్మానంపై నోటీసిచ్చిన టిడిపి అదే సమయంలో సభలో చేస్తున్న గోల విషయంలో టిడిపి ఎంపిలను ఏకిపారేసింది. కేంద్రదప్రభుత్వంపై వైసిపి, టిడిపిలు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు నోటీసులిస్తున్నారు. ఇంకోవైపు సభలో గోల చేస్తున్నారు. అందుకనే రెండు సార్లు పార్టీలిచ్చిన నోటీసులను స్పీకర్ చదివినా చర్చకు పెట్టే వాతావరణం లేదన్న కారణంతో సభను వాయిదా వేశారు. దాంతో సభలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత స్పీకర్ నోటీసును చదివి వినిపించేటపుడు సభ్యులు ప్రశాంతంగా ఉంటేనే చర్చను స్పీకర్ టేకప్ చేస్తారు. లేకపోతే గందరగోళంగా ఉందన్న కారణంతో సభను వాయిదా వేయటం మామూలే.

అయితే, ఇక్కడే మతలబుంది. అదేమిటంటే, ఒకవైపు నోటీసు ఇస్తూనే మరోవైపు సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. టిఆర్ఎస్, ఏఐఏడిఎంకె తదితర సభ్యులు గందరగోళం చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు మొదలు టిడిపి ఎంపిలందరూ ఆరోపిస్తున్నారు. వారి వాదననే టిడిపికి మద్దతుగా నిలిచే మీడియా కూడా పదే పదే ప్రసారాలు చేస్తోంది. జనాలు కూడా నిజమే అనుకున్నారు.

అయితే, జాతీయ మీడియా మాత్రం టిడిపి ఎంపిలను ఉతికి ఆరేస్తోంది. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని టిడిపి ఎంపిలు నినాదాలు చేయటాన్ని జాతీయ మీడియా ప్రసారం చేసి మరీ చూపించింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానానికి నోటిసిచ్చిన తర్వాత సభలో నోటీసు చర్చకు రాకుండా గోల చేయటం ఏంటంటూ నిలదీసింది. జాతీయ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకోలేక ఎంపిలు అవస్తలు పడుతున్నారు. టిడిపి వైఖరిపై జాతీయ మీడియా పెద్ద ఎత్తున చర్చ కూడా జరపటంతో టిడిపి పరువంతా పోయింది.