Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీచేసింది.

national green tribunal inquiry on LG Polymers Gas Leakage
Author
Visakhapatnam, First Published Jun 3, 2020, 11:22 PM IST

న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీచేసింది. జిల్లా కలెక్టర్ వద్ద ఉంచిన రూ. 50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలంటూ ఎన్జీటీ లిఖితపూర్వక ఆదేశాలు వెలువరించింది.

అలాగే కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్దర ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని...రెండు నెలల్లో ఈ కమిటీ పునరుద్ధర ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని ఎన్జీటి వెల్లడించింది.   

పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో  కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీరి సంస్థ నుంచి ప్రతినిధులను తీసుకుని రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

read more  సంచలనం...విజయవాడలో మహిళా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి రాష్ట్ర సీఎస్ చర్యలు తీసుకోవాలని...తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలని సూచించింది. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభం కాకూడదని...చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే సంస్థ తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తుందన్నారు. 

ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరం తెలపడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ కు ఉందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హాని కలిగి చర్యలు జరిగినప్పుడు ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని హెచ్చరించింది. విచక్షణాధికారాలకు లోబడే సుమోటో గా కేసు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

హైకోర్టు, ఇతర ఫోరాలు వేసిన కమిటీలు చేసే విచారణల్లో ఎలాంటి విభేదం ఉండదంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను ఇస్తుందన్నారు. నవంబర్ 3కి తదుపరి విచారణ వాయిదా వేసింది ఎన్జీటి.  

Follow Us:
Download App:
  • android
  • ios