విజయవాడ: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా నిస్వార్ధంగా, నిబద్దతతో సేవలు అందిస్తున్న వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు అందించారు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.  అపాయం ముంచుకోస్తుందని తెలిసినా వెన్ను చూపని నైజం వైద్యులదని... ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 

''ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నివారణకు అవిశ్రాంతంగా వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయం. కరోనా బారిన పడిన వారిని రక్షించడానికి రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. కనిపించని శత్రువుకు భయపడకుండా కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు'' అని అన్నారు. 

''వైద్యులు దేవుళ్ళతో సమానం అంటారు. కరోనా ప్రజలను వణికిస్తున్న విపత్కర పరిస్థితులల్లో సేవలు అందించడానికి ఏ మాత్రం వెనుకంజ వేయని వైద్యులు నిజంగానే దేవుళ్ళతో సమానం.... నిస్వార్ధంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు,వైద్య సిబ్బందికి వందనం.. అభివందనం. అలాంటి వైద్యులందరికి మరోసారి  జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు వైద్యశాఖ మంత్రి ఆళ్ళ నాని.