న్యూఢిల్లీ: ఏపీకి రాజధాని అమరావతి ఉండేలా అందరం కలిసి పోరాటం చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. తనకు భద్రత కల్పించే విషయంలో కేంద్రం తాత్సారం చేస్తున్న విషయమై మంగళవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో ఆయన భేటీ అయ్యారు

ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన సూచించారు. తనకు భద్రత కల్పించే విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోన్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఎంపీ రఘురామకృష్ణం రాజు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు  పెడతారని భయపడొద్దని ఆయన సూచించారు. 

also read:జగన్‌కి మరో లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు: విషయం ఇదీ...

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేశారు. ఎంపీ కూడ వారిపై కౌంటర్ ఎటాక్ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు. గ్రంధి శ్రీనివాసరావు, ప్రసాదరాజు, మంత్రి చెరుకువాడశ్రీరంగనాథరాజులు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు.

తనకు భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖకు కూడ రఘురామకృష్ణంరాజు లేఖ రాశాడు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు హోం సెక్రటరీ అజయ్ భల్లాను కూడ ఆయన కలిశారు. మరో  వైపు తనకు భద్రతను కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.