అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాశాడు. ఇటీవల కాలంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నాడు.

రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరాడు. ఈ లేఖ ప్రతిని ఆయన ఆదివారం నాడు మీడియాకు విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటుకు కమిటీలను ఏర్పాటు చేశారని ఆ లేఖలో రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలపై దృష్టి సారించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు, తాడేపల్లిలోని గోశాలలో విషప్రయోగం ద్వారా 100 ఆవులు మరణించిన విషయాన్ని ఆ లేఖలో ఎంపీ గుర్తు చేశారు.అన్ని వర్గాలతో కలిసి గోశాలల అభివృద్ధి కమిటీలు వేయాలని ఆయన కోరారు.

also read:జగన్‌కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ: విషయం ఇదీ...

ఈ నెల 14వ తేదీన భవన నిర్మాణ కార్మికుల విషయమై ఎంపీ రాజు సీఎం జగన్ కు లేఖ రాశాడు. భవన నిర్మాణ కార్మికుల పేర్లను ఆధార్ తో లింక్ చేయాలని ఆ లేఖలో కోరారు.

అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసిన తర్వాత పలు అంశాలపై జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రాలను సంధిస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని, వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిపై ఇప్పటికే సీఎం జగన్ కు రఘురామకృష్ణంరాజు లేకలు రాశాడు.