ప్రధాని పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి : నేడు ప్రధాని మోదీ 72వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Scroll to load tweet…
నవభారత నిర్మాణంలో నిర్విరామ శ్రామికుడు, ప్రపంచం నలుమూలలా కొనియాడబడుతున్న లోకనాయకుడు, ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలను తనదైన శైలిలో సునాయాసంగా పూర్తి చేసిన ధీరుడు,దీశాలి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..అంటూ ట్వీట్ చేశారు.
Scroll to load tweet…
