అమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్‌ నరసింహన్ అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన తర్వాత కూడా ఎక్కువకాలం గవర్నర్ గా పనిచేసి రికార్డు సృష్టించారు నరసింహన్.  

2010 జనవరిలో నరసింహన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన గవర్నర్ గా కొనసాగుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన, ఏకకాలంలో సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా పని చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు.  

ఇకపోతే అత్యధికంగా ఆరుగురుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు నరసింహన్. 1968 ఐపీఎస్‌ బ్యాచ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికైన నరసింహన్‌ అనంతరం చాలా ఏళ్ల‌ పాటు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ)లో పని చేశారు. ఐబీ చీఫ్‌గా 2006 డిసెంబర్‌ వరకు పని చేసిన ఆయన ఆ ఏడాది చివరిలో రిటైరయ్యారు. 

అనంతరం యూపీఏ వన్ సర్కార్ నరసింహన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించింది. ఏపీ గవర్నర్‌గా ఎన్‌డి తివారీ రాజీనామా చేసిన తర్వాత ఇంచార్జ్ గవర్నర్ గా ఏపీకి వచ్చారు నరసింహన్. అనంతరం 2010 జనవరి 23న ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా ఎంపికయ్యారు నరసింహన్. 

రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు నరసింహన్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలతో మంత్రాంగ నడుపుతున్నారంటూ అటు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.  అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు. 

ఇకపోతే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అనివార్య కారణాల వల్ల రోశయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

 రోశయ్య రాజీనామా అనంతరం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దాంతో 2010 డిసెంబర్ 25న కిరణ్ కుమార్ రెడ్డితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 16వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో మెుదలైన మెుదలైన గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం నలుగురికి చేరుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో మెుదలైన మెుదలైన గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం నలుగురికి చేరుకుంది.    

తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగాయి. 2014 జూన్ 2న తెలంగాణ సీఎంగా కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్.

ఇకపోతే ఇటీవలే జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేత రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. ఇప్పటి వరకు ఐదుగురుతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్.  

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో సీఎంగా వైయస్ జగన్‌తో ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ఇప్పటి వరకు గవర్నర్ నరసింహన్ ఐదుగురితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారన్నమాట. 

ఒక గవర్నర్ ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని తెలుస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ నరసింహన్ నెలకొల్పిన రికార్డు అంటూ ప్రచారం జరుగుతుంది.