గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సుబ్బాయమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

ఆమె మరణం పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవింద బాబుపై 30 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు.