తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు నరసారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను కేసీఆర్ సర్కార్ వేధిస్తోందన్నారు.

టీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీ మారుతున్నారని రాయపాటి ఆరోపించారు. కేసీఆర్ నమ్మకద్రోహి అని, ఆయన ఎన్ని బెదిరింపులకు పాల్పడినా లొంగేది లేదన్నారు.

మోడీ, కేసీఆర్, జగన్ కలిసిన చంద్రబాబును ఏం చేయలేరని  సాంబశివరావు స్పస్టం చేశారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని రాయపాటి జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి తన కంపెనీకి రూ.300 కోట్లు పరిహారంగా అందాల్సి వుందని, కానీ ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు  సాంబశివరావు చెప్పారు.