అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలకమైన మూడు రాజధానుల బిల్లు మీద వేడివాడిగా చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కునుకు తీశారు. అ కునుకు తీస్తున్న జగన్ ఫొటోను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఓ పక్క రాజధాని మార్పుపై అధికార పక్షం తన వాదనలను బలంగా వినిపిస్తుంటే, మరో వైపు అమరావతి రైతులు సచివాలయాన్ని నాలుగు వైపుల నుంచి ముట్టడించారు. ఈ స్థితిలో అక్కడ ఉద్రిక్తర వాతావరణ చోటు చేసుకుంది. 

ఆ పరిస్థితిపై నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ జరుగుతుండగా అసెంబ్లీలో వైఎస్ జగన్ కునుకు తీశారంటూ టీవీ చానెల్ లో వచ్చిన ఓ ఫొటోను ఆయన పోస్టు చేశారు. 

"ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుటే ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది