Asianet News TeluguAsianet News Telugu

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాదు మూర్ఖ‌మంత్రి...కర్నూల్ ఘటనే నిదర్శనం: నారా లోకేష్

 కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయ‌డాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. 

nara lokesh serious on kurnool basaladoddi incident akp
Author
Kurnool, First Published Jun 8, 2021, 4:52 PM IST

కర్నూల్: ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు... ప్ర‌భుత్వంలోకొచ్చాక ప్ర‌జ‌లంద‌రినీ స‌మానంగా చూడాల్సిన జ‌గ‌న్‌రెడ్డి కుల‌, మ‌త‌, ప్రాంత‌, పార్టీల వారీగా ప్ర‌జ‌ల్ని విభజించి పాలిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. ఈ చర్యల ద్వారా తాను ముఖ్య‌మంత్రిని కాదు మూర్ఖ‌మంత్రిన‌ని నిరూపించుకున్నార‌ని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయ‌డాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. అవినీతిపై ప్ర‌శ్నిస్తూ, అక్ర‌మాల‌పై నిల‌దీస్తోన్న ప్ర‌తిప‌క్షంపై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తోన్న ముఖ్య‌మంత్రి... ప్ర‌జ‌ల‌పైనా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డం చాలా దారుణ‌మ‌ని పేర్కొన్నారు. 

ఒక ఫ్యాక్ష‌నిస్టు చీఫ్ మినిస్ట‌ర్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జ‌గ‌న్‌రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ఇటువంటి అరాచ‌కాలు సాగుతున్నాయ‌ని తేట‌తెల్లం అవుతోంద‌న్నారు. వేస‌వికాలంలో ప‌ల్లెల్లో తాగునీరు అంద‌కుండా చేసి, వైసీపీ నాయ‌కులు వికృతానందం పొందుతున్నార‌ని ఆరోపించారు. వెంట‌నే బ‌స‌ల‌దొడ్డిలో టిడిపి సానుభూతిప‌రుల‌కు తాగునీరు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.

read more  తోడు పేరుతో ఉన్న గూడునూ కొల్లగొడతారా..?: జగన్ సర్కార్ ను నిలదీసిన పంచుమర్తి అనురాధ

కర్నూల్ ఘటనపై టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా స్పందిస్తూ... ఎన్నికలకు ముందు కులమతాలు చూడమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయడం హేయమైన చర్య అని...  దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అచ్చెన్న. 

''టీడీపీకి ఓట్లు వేస్తే త్రాగడానికి నీరివ్వరా? జగన్ ముఖ్యమంత్రిగా సేవ చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరికా? లేక వైసీపీ కార్యకర్తలకేనా? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనం'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి జగన్  పాలన గాలికొదిలి ఓ వైపు టీడీపీకి ఓట్లేసిన వారికీ సంక్షేమ పధకాలు ఆపి వేస్తూ, మరో వైపు కోవిడ్ సమయంలో కూడా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. వివాద రహితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పై అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేదిస్తున్నారు.  2 ఏళ్ల పాలనలో  దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి ఏంటి?'' అని నిలదీశారు. 

''టీడీపీ హయాంలో అభివృద్ధిలో ముందున్న ఆంద్రప్రదేశ్ ని అక్రమ కేసులు అరాచకల్లో దేశంలోనే  నెం. 1 ప్లేస్ లో వుచారు జగన్. ఇలా రాష్ట్రాన్ని అక్రమ అరెస్టుల ఆంద్రప్రదేశ్ గా మార్చారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సంవత్సరాలే వ్యాలీడిటి, ఆ తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. ఆరోజు  నుంచి జగన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు  ప్రతి రోజూ పశ్చాత్తాప పడాల్సి వస్తుంది'' అని అచ్చెన్న హెచ్చరించారు. 
                                         
 

Follow Us:
Download App:
  • android
  • ios