గుంటూరు:  టిడిపి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కోవాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.  కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిరుపేదల గుడిసెలను తొలగించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు.పేదల భూములు లాక్కొని పేదలకే అమ్మడం వైఎస్ జగన్ మార్క్ రివర్స్ టెండర్. టిడిపి హయాంలో నిరుపేదల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం జగన్ గారి అహంకార ధోరణకి నిదర్శనం'' అని లోకేష్ మండిపడ్డారు. 
  
''మీకు ఉండటానికి విల్లాలు,  రాజప్రసాదాలు కావాలి పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా?'' అంటూ ఎమ్మిగనూరులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికన సీరియస్ అయ్యారు.