ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ వచ్చినట్లు... స్పెషల్ ప్లైట్ లో దాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ కలగంటున్నారని టిడిపి నాయకులు నారా లోకేష్ ఎద్దేవా చేసారు. 

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కావాల్సివుండగా చర్చకువచ్చే అంశాలతో కూడిన ఎంజెండాను ప్రకటించారు. అయితే ఈ ఎజెండాలో మొదట ఏపీకి స్పెషల్ స్టేటస్ (ap special status) అంశం వుండటంతో ఇది సీఎం జగన్ (ys jagan) వల్లే సాధ్యమయ్యిందని వైసిపి (YSRCP) నాయకులు మాట్లాడారు. 

అయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఎంజెండా నుండి తొలగించడంతో ఈసారి టిడిపి (TDP) నాయకులు మాట్లాడసాగారు. సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం వల్లే స్పెషల్ స్టేటస్ పై కేంద్రం దిగివచ్చిందన్న వైసిపి నాయకులు ఇప్పుడేమంటారు అంటూ టిడిపి నాయకులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కూడా జగన్ కు చురకలు అంటించారు.

''తాడేపల్లి పాలస్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా ఢిల్లీ వెళ్లినట్టు... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని అదే ఫ్లైట్ లో పట్టుకొచ్చినట్టు, వైసిపి నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగినట్టు స్పెషల్ కల వచ్చింది... ఇంతలోనే తెల్లారింది... అప్పుడు అర్థమైంది అదంతా తాను ప్రత్యేకంగా తయారు చేయించిన స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ ఎఫెక్ట్ అని!'' ట్విట్టర్ వేదికన జగన్ నిద్రపోతున్నట్లుగా వున్న ఓ పోటోనే జతచేస్తూ లోకేష్ ఎద్దేవా చేసారు.

Scroll to load tweet…

ఇదిలావుంటే విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి గత శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహించనున్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.

అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఎజెండా నుండి తొలగించారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. బిజెపిలో చేరిన తమ పార్టీ ఎంపీల ద్వారా చంద్రబాబు ఈ పని చేయించారని ఆరోపిస్తున్నారు. ఇక ఏపీకి చెందిన బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ద్వారా చంద్రబాబు ఈ పని చేయించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 

ప్రతిపక్ష టిడిపి కూడా స్పెషల్ స్టేటస్ అంశం ఎజెండాలో వుండటంతో చాలా ఎక్కువగా మాట్లాడిన వైసిపి నాయకులు ఇప్పుడు ఏమంటారంటూ నిలదీస్తున్నారు. సీఎం జగన్ వల్లే స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఎజెండాలో పెట్టారన్న వైసిపి నాయకుల మాటలను గుర్తుచేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.