అమరావతి: తమ నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలకు ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయా నియోజకవర్గాలకు విడుదల చేసిన నిధుల వివరాలను మంత్రి ట్వీట్ చేశారు.

 

 


కొన్ని నియోజకవర్గాల్లో  ప్రజలు నమ్మకంతో వైసీపీ అభ్యర్ధులను గెలిపిస్తే ప్రజలకు  ఆ  ఎమ్మెల్యేలు ఏమిచ్చారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగింది లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా.. మేం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అని లోకేష్‌ ట్విట్టర్‌లో చెప్పారు.