Asianet News TeluguAsianet News Telugu

మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే ఇలాగే వుంటుంది..: నరసరావుపేట ఘటనపై లోకేష్ ఆగ్రహం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. 

nara lokesh reacts on narasaraopet incident... sensational comments on cm ys jagan
Author
Amaravati, First Published Jan 16, 2022, 10:18 AM IST

గుంటూరు:మాజీ సీఎం, ప్రస్తుతం సీఎం జగన్ (ys jagan) తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajashekar reddy) విగ్రహం మాయం....  ఆ తర్వాతి పరిణామాలతో నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డ (jonnalagadda)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి (TDP) కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నరసరావుపేట టిడిపి ఇంచార్జీ చదలవాడ అరవింద్ బాబు (chadalavada arvind babu) అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయనను హాస్పిటల్ కు తరలిస్తుండగా అంబులెన్స్ పై వైసిపి (YCP) శ్రేణులు రాళ్లదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సీరియస్ అయ్యారు. . 

''మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలన్నిటిని విధ్వంసం చేస్తాడనడానికి ఈ రోజు నరసరావుపేటలో జరిగిన ఘటన ఉదాహరణ. సంబంధం లేని విషయంలో టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నియోజకవర్గ ఇంఛార్జ్ అరవింద్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చెయ్యడమే కాకుండా ఆయన్ని తరలిస్తున్న అంబులెన్స్ పై వైసిపి రౌడి మూకలు దాడి చేస్తున్నా ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసుల ఏకపక్ష ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని లోకేష్ అన్నారు. 

''పోలీసు శాఖకి ఉన్న గౌరవాన్ని గంగలో కలిపేసే విధంగా కొంతమంది పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు. టిడిపి  కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చెయ్యాలి. అరవింద్ బాబు గారిపై దాడికి పాల్పడిన వైసిపి రౌడీలను అరెస్ట్ చేసి శిక్షించాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా టిడిపి నేత చదలవాడ అరవింద్ బాబుపై జరిగిన దాడిపై సీరియస్ అయ్యారు. ఈ దాడిని ఖండించిన ఆయన వైసీపీ మూకలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి పార్టీ నేతల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.
 
టిడిపి కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా? అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరవింద్‍ బాబుతో పాట ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం... ఈ క్రమంలో అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. 

చదలవాడపై జరిగిన దాడిపై టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. సంక్రాంతి పండగపూట రాష్ట్రంలో వైసిపి అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?  అని ప్రశ్నించారు. 

''నరసరావుపేటలో టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‍బాబుపై పోలీసులు, వైసీపీ నేతల దౌర్జన్యం చేయడం దుర్మార్గం. పండుగపూట కూడా వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడడం దారుణం. అరవింద్‍బాబు, టీడీపీ శ్రేణులపై పోలీసులు, వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులు, అందుకు సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios