కడప జిల్లాలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ(గురువారం) ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి. అతడి అంతిమ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. 

సుబ్బయ్య అంత్యక్రియలు ముగిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు నందం సుబ్బయ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసారని ఆరోపించారు. ఈ దారుణానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

''పార్టీ కోసం పనిచేసిన సుబ్బయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. పార్టీ తరపున రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. జిల్లా పార్టీ తరపున మరో రూ.14 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఇద్దరి పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటాను'' అంటూ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు లోకేష్. 

read more  టీడీపీ నేత నందం సుబ్బయ్య అంతిమయాత్ర: పాల్గొన్న లోకేష్

''సుబ్బయ్య హత్య జరిగిన ప్రాంతంలో తీసిన వీడియోలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పటి వరకూ సెల్ ఫోన్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. సుబ్బయ్య ఫోన్ లో ఎమ్మెల్యే అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వెంటనే సెల్ ఫోన్ ట్రేస్ చెయ్యాలి. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి'' అని డిమాండ్ చేశారు.

''పోలీసులు హామీ ఇచ్చిన విధంగా 15 రోజుల్లో దర్యాప్తు ముందుకు సాగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రొద్దుటూరుకి వస్తాం. మరోసారి ఉద్యమిస్తాం'' అని లోకేష్ హెచ్చరించారు. 

వీడియో

"