వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మాట్లాడేందుకు చాలా మంది టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఈ చిత్రంపై తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మనవడు, ఏపీ మంత్రి లోకేష్ మాత్రం.. ఈ విషయంలో మాట్లాడానికి భయపడుతున్నారు.

వర్మ తీస్తున్న ఈ సినిమా గురించి ఏది మాట్లాడితే ఏమౌతుందో అని లోకేష్ జంకుతున్నారు. అందుకే ఆ విషయం ప్రస్తావిస్తే  మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఇటీవల ఇదే విషయం గురించి లోకేష్ ని విలేకరులు ప్రశ్నించగా..‘‘ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తే తీయనీయండి. అది సినిమా మాత్రమే.. సినిమా గురించి మాట్లడను’’ అంటూ  విషయం దాటేశాడు.  

 సినిమా నటుడిగా ఎన్టీఆర్ జీవితంలో ఎటువంటి వివాదాలు లేవు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు కూడా వివాదమేమీ లేదు. ఎన్టీఆర్ జీవితంలో ఏమైనా వివాదముందా అంటే 1993 సెప్టెంబర్ లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటానని ప్రకటన చేసిన తర్వాతే మొదలైంది. వర్మ కూడా ఆ వివాదాన్ని బేస్ చేసుకునే సినిమా తీస్తున్నాడు. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవటం, తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రవ్వటం, వెంటనే చంద్రబాబునాయుడు అండ్ కో పార్టీలో తిరుగుబాటు లేవదీసి సిఎంగా ఎన్టీఆర్ ను దింపేయటం అందరికీ తెలిసిందే. ఈ విషయాలన్నీ సినిమాలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.  ఆ భయంతోనే  లోకేష్ ఈ విషయం గురించి పెద్దగా స్పందించడం లేదనే వాదనలు వినపడుతున్నాయి.