అమరావతి: తన తనయుడు నారా దేవాన్షు పుట్టిన రోజు సందర్బంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్య చేశారు. తనతో ఎల్లప్పుడూ పిల్లో ఫైట్ చేస్తుంటాడని, సాహసోపేతమైన ప్రయాణాలు చేస్తుంటాడని ఆయన అన్నారు. 

"నాతో పిల్లో ఫైట్ చేసే నా బెస్ట్ ఫ్రెండ్, నాతో అడ్వెంచరస్ ప్రయాణాలు చేసే నా స్నేహితుడు, ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే నా రియల్ లైఫ్ హీరో.. నాకన్నా అధికంగా ఇష్టపడే నా కుమారుడికి హ్యాపీ బర్త్ డే. లవ్ యూ దేవాన్షు" అని లోకేష్ ట్వీట్ చేశారు.