Asianet News TeluguAsianet News Telugu

ఆందోళనకరంగా సీఎం జగన్ మానసిక పరిస్థితి...అందువల్లే ఈ నిర్ణయం: లోకేష్ సంచలనం

ప్రధాని దగ్గర నుండి దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులది ఒక దారయితే మన పేరాసిట్మాల్ రెడ్డి(సీఎం జగన్)ది ఇంకొక దారి అని మాజీ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. 

nara lokesh face to face programme with stundents, parents and Psycholigist akp
Author
Amaravati, First Published Jun 8, 2021, 2:45 PM IST

అమరావతి: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం మంచిది కాదని స్వయంగా ప్రధాని మోదీ సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసారు... కానీ తాడేపల్లి పేరాసిట్మాల్ రెడ్డి మాత్రం నేను పరీక్షలు నిర్వహించి తీరుతా అని అంటున్నాడంటూ సీఎం జగన్ పై మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు. ప్రధాని దగ్గర నుండి దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులది ఒక దారయితే మన పేరాసిట్మాల్ రెడ్డిది ఇంకొక దారి అని ఎద్దేవా చేశారు.  పేరాసిట్మాల్ రెడ్డి పిచ్చి పరాకాష్టకి చేరిందని లోకేష్ విరుచుకుపడ్డారు. 

'కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ-విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి' అనే అంశంపై మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ రెడ్డి గురించి సొంత పార్టీ ఎంపీ చెప్పింది నిజమేనని అనిపిస్తోందని...ఆయన మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వుందన్నారు. 

''ఎంత పెద్ద మూర్ఖుడైనా చిన్న పిల్లల జోలికి రాడు... కానీ పేరాసిట్మాల్ రెడ్డి ఆఖరికి పిల్లల్ని కూడా వదలడం లేదు. పిల్లలు మన దేశ సంపద, మన దేశ భవిష్యత్తు. అలాంటి పిల్లల భవిష్యత్తు తో ఆటలాడే వాడిని ఏమంటాం? పిల్లల్ని మానసికంగా హింసించే వాడిని ఏమంటాం? ఆయన జగన్ రెడ్డి కాదు హింసించే పులకేశి!'' అని లోకేష్ విరుచుకుపడ్డారు. 

''ఇప్పటివరకు రాష్ట్రంలో 17.60 లక్షల కేసులు నమోదవగా,11,552 మంది చనిపోయారు.పేరాసిట్మాల్ రెడ్డి చేతగాని తనం వలన గ్రామాల్లో కూడా కరోనా కేసులు పెరిగిపోయాయి. దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు సమీక్షలు నిర్వహించి, కోవిడ్ ఆసుపత్రులకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పించారు. ఒక్క పేరాసిట్మాల్ రెడ్డి తప్ప. ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, మందులు లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే తాడేపల్లి కొంపలో ఫిడేలు వాయిస్తున్నాడు పేరాసిట్మాల్ రెడ్డి'' అని మండిపడ్డారు.

''థర్డ్ వేవ్ లో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రభావం మన రాష్ట్రంలో మొదలైంది. టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే దాదాపుగా 10 శాతం మంది పిల్లలకు వైరస్ రావటం మొదలు పెట్టింది'' అని తెలిపారు. 

read more  టిడిపి అధికారంలోకి రాగానే జగన్ పరిస్థితి ఇదే...: అచ్చెన్నాయుడు వార్నింగ్

''రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు పెడితే, పరిస్థితి ఏమిటి ? సరైన పీడియాట్రిక్ విభాగాలు మన హాస్పిటల్స్ లో ఉన్నాయా ? ఇప్పుడు పెద్దలకు చేస్తున్న కరోనా వైద్యం, పిల్లలకు చేయలేం కదా? ప్రభుత్వం దీనికి సమాయత్తం అవుతున్నట్టు కనిపించటం లేదు'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

''పిల్లలకు సరైన ఆన్లైన్ క్లాసులు కూడా జరగలేదు. పేదలకు ఉపయోగపడే ఫైబర్ నెట్ ని నాశనం చేసారు. పోనీ సప్తగిరి ఛానెల్ ని పూర్తిగా ఉపయోగించి పిల్లలకు అందులో సరైన విధంగా పాఠాలు చెప్పరా అంటే అదీ లేదు. ఇక మరో పక్క పదో తరగతి పిల్లలు మరీ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఇప్పటికే కొన్ని పట్టణాల్లో, ఇంటర్ క్లాసులు మొదలు అయ్యాయి. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు ఉంటాయో లేదో తెలియదు, ఈ క్లాసులకు వెళ్ళకపోతే, ఇది మిస్ అవుతామని భయం పిల్లల్లో ఉంది'' అన్నారు. 

''అలాగే ఇంటర్ పిల్లలు కూడా, చాలా చోట్ల జేఈఈ, నీట్‌ కోచింగ్‌ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించారు. ఇప్పుడు కోచింగ్‌ తరగతులకు హాజరు కావాలా? పరీక్షలకు సన్నద్ధం కావాలా?  నిర్లక్ష్యం చేస్తే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంకు రాదనే భయం విద్యార్థులను వెంటాడుతోంది. ఎందుకు ఆ పసి హృదయాలకు అంత వేదన?'' అని జగన్ సర్కార్ ను నిలదీశారు.

''పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది 15 రోజుల ముందు సమాచారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులు చదువుకోవడం ఎంత కష్టం? మరోవైపు సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసినందున ఆ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. స్టేట్ విద్యార్థులు బాధ వర్ణాణాతీతంగా ఉంది. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో పరీక్షలు పెట్టాలి అంటే, పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి. ఇది ఇప్పటిలో సాధ్యం అయ్యే పనేనా ? అయినా ఇప్పటికే జూన్ వచ్చింది. పరీక్షలు సెప్టెంబర్ లో పెట్టినా, అది అంతా అయ్యే సరికి అక్టోబర్ అవుతుంది. కొత్త అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మొదలు పెడతారు? నాలుగు నెలల్లో అకాడమిక్ ఇయర్ పూర్తి చేస్తే ఉపయోగం ఏంటి?'' అని లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

''పోయిన ఏడాది కూడా పదవి తరగతి పరీక్షల షెడ్యుల్ మూడు సార్లు మార్చి చివరకు రద్దు చేసారు. ఇప్పుడూ అదే దారిలో వెళ్తున్నారు. పదవ తరగతి అనేది విద్యార్ధుల జీవితాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. మీ అనాలోచిత నిర్ణయాలతో, పిల్లల్ని ఎందుకు ఒత్తిడికి గురి చేస్తారు? జగన్ రెడ్డి తలతిక్క నిర్ణయాల వలన పిల్లల్లో మానసిక ఆందోళన ఎక్కువవుతోంది. పరీక్షలా?ప్రాణాలా ఈ రెండిటి మధ్యా నలిగిపోతున్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం మరింత గందరగోళానికి గురిచేస్తుంది'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. .
 


 

Follow Us:
Download App:
  • android
  • ios