Asianet News TeluguAsianet News Telugu

టిడిపి అధికారంలోకి రాగానే జగన్ పరిస్థితి ఇదే...: అచ్చెన్నాయుడు వార్నింగ్

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయడం హేయమైన చర్య అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

ap tdp chief atchannaidu warning to cm ys jagan akp
Author
Amaravati, First Published Jun 8, 2021, 9:26 AM IST

అమరావతి: ఎన్నికలకు ముందు కులమతాలు చూడమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయడం హేయమైన చర్య అని.  దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అచ్చెన్న. 

''టీడీపీకి ఓట్లు వేస్తే త్రాగడానికి నీరివ్వరా? జగన్ ముఖ్యమంత్రిగా సేవ చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరికా? లేక వైసీపీ కార్యకర్తలకేనా? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనం'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

read more  అలా అయితే జగన్‌పైనే కేసు నమోదు చేయాలి: లోకేష్

''ముఖ్యమంత్రి జగన్  పాలన గాలికొదిలి ఓ వైపు టీడీపీకి ఓట్లేసిన వారికీ సంక్షేమ పధకాలు ఆపి వేస్తూ, మరో వైపు కోవిడ్ సమయంలో కూడా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. వివాద రహితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పై అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేదిస్తున్నారు.  2 ఏళ్ల పాలనలో  దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి ఏంటి?'' అని నిలదీశారు. 

''టీడీపీ హయాంలో అభివృద్ధిలో ముందున్న ఆంద్రప్రదేశ్ ని అక్రమ కేసులు అరాచకల్లో దేశంలోనే  నెం. 1 ప్లేస్ లో వుచారు జగన్. ఇలా రాష్ట్రాన్ని అక్రమ అరెస్టుల ఆంద్రప్రదేశ్ గా మార్చారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సంవత్సరాలే వ్యాలీడిటి, ఆ తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. ఆరోజు  నుంచి జగన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు  ప్రతి రోజూ పశ్చాత్తాప పడాల్సి వస్తుంది'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios