Asianet News TeluguAsianet News Telugu

Nara Lokesh: బరువెక్కిన హృదయంతో.. తడిసిన కళ్లతో రాస్తున్నా.. : నారా లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్ 

Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరుణంలో నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Nara Lokesh Emotional Note over TDP president Chandrababu Naidu judicial remand KRJ
Author
First Published Sep 11, 2023, 12:27 AM IST

Nara Lokesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరుణంలో చంద్రబాబు వెంటనే నారా లోకేష్ కూడా రాజమండ్రికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నారా లోకేష్.

బరువెక్కిన హృదయంతో..  కన్నీళ్లతో తడిసిన కళ్లతో రాస్తున్ననంటూ లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్ని, ఆత్మను ధారపోశారని పేర్కొన్నారు. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న అతనికి( చంద్రబాబుకు) విశ్రాంతి అనేది తెలియదన్నారు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో ఇమిడి ఉన్నాయని అన్నారు. ఆయన ప్రేమ, సేవకు ఎంతో మంది ప్రేరణ పొందారని, వారి హృదయపూర్వక కృతజ్ఞతలు  స్వచ్ఛమైన ఆనందంతో నింపిందని అన్నారు. 

తాను కూడా ఆయన గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాననీ, ఆయన అడుగుజాడలను అనుసరించానని అన్నారు. అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాననీ, ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు, అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉందని అన్నారు. 

అయినప్పటికీ.. నేడు చేయని నేరానికి మా నాన్నను అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే..  నా కోపం ఉప్పొంగింది.నా రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగ ముంచే లోతులకు హద్దులు లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇంతటి ఘనకార్యం చేసిన ఉన్నత వ్యక్తి కి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఆయన ( చంద్రబాబు) ఎప్పుడూ పగ లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేకపోవడం వలన? మనం ఇతరుల కంటే ముందే అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఊహించినందుకా?  అని ప్రశ్నించారు. 

ఈరోజు నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు, నేనూ అలాగే.. ఆంధ్ర ప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తితో ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అని నారా లోకేష్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios