Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నానీ... అసలు సన్నాసి ఎవరు?: లోకేష్ ఫైర్

మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి చివరోజయిన ఇవాళ(సోమవారం) లోకేష్ బందరులో ప్రచారం చేపట్టారు. 

nara lokesh election campaign at bandaru
Author
Kakinada, First Published Mar 8, 2021, 5:10 PM IST

తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని... బందరు లో పీకింది ఏంటి? అని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకాయన ఆయన కోడికత్తి డ్రామా.ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అని విమర్శించారు. తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించాడని లోకేష్ మండిపడ్డారు. 

మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి చివరోజయిన ఇవాళ(సోమవారం) లోకేష్ బందరులో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాని అంటేనే నాకెంత? నీకెంత? అని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు జగన్ రెడ్డి అప్పగించారని... వారిలో ఒకరు బూతుల శాఖ మంత్రి ...గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని, రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని, మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ లోకేష్ సెటైర్లు విసిరారు. 

''గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి, బందరు నాని నోరిప్పితే అబద్దం, కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని. బందరు నానికి మాటలు పీక్...మ్యాటర్ వీక్...క‌రెంటు బిల్లు ఎక్కువొచ్చింద‌య్యా అని నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు అడిగితే క‌ల‌ర్ టీవీ వాడితే క‌రెంటు బిల్లు ఎక్కువొస్తుంద‌ని చెప్పిన మెద‌డు మోకాలులో ఉన్న మంత్రి వుండ‌టం మ‌న ఖ‌ర్మ'' అని మండిపడ్డారు.

''బందరుని అభివృద్ధి బాట పట్టించేందుకు టీడీపీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మచిలీపట్నంలో ప్రధానమైనది డ్రైనేజీ సమస్య సరిగా లేకపోవడం. దీన్ని సరిదిద్దేందుకు మేం చేపట్టిన కొన్ని కార్యక్రమాలను మధ్యలో వదిలేశారు. టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు అలాగే మిగిలి ఉన్నాయి. తట్ట మట్టి కూడా ఎత్తలేదు. అలాగే మంచి నీటి సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం ట్యాంకులను నిర్మిస్తే ఇప్పటివరకు వాటిని వాడుకలోకి తీసుకురాక పోవడం ఏంటీ..? నానీ గారూ.. బందరు ప్రజలకు మేం కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి మంచి నీళ్లిస్తే మంచి నీళ్లే ఇచ్చారంటారు తప్ప.. టీడీపీ నీళ్లు అనో.. కొల్లు రవీంద్ర నీళ్లనో అనరు.. మా మీద.. టీడీపీ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపొద్దు'' అని సూచించారు. 

read more   ప్రజలకు సిగ్గుంటే...., రోషం, పౌరుషం లేదా: రెచ్చిపోయిన చంద్రబాబు

''ఇళ్ల పట్టాలిచ్చారు.. ఎందుకు ఆ కాగితాలతో నాలిక గీసుకోవాలా..? స్థలాలు ఎక్కడున్నాయో చూపండి నాని. టిడిపి హయాంలో మచిలీపట్నంలో 4200 టిడ్కో ఇల్లు కట్టాం. వాటిని పేదలకు ఇవ్వలేని చేతగాని మంత్రి బందరు నాని. బందరు నుంచి ఎమ్మెల్యేగా నానిని ఎన్నుకున్నారు.. మంత్రి అయ్యాడు.. బందరుకేమీ చేయకపోవచ్చు.. కనీసం బందరు ఆర్టీసీ బస్టాండ్ కూడా సరి చేయలేకపోయారు. రవాణా శాఖ మంత్రి అయ్యుండి కూడా బస్టాండుని బాగు చేయలేకపోయారు నాని. అయ్యా నానీ గారూ మీ శాఖకు చెందిన పనిని.. మీ నియోజకవర్గంలోనే చేసుకోలేపోయారు.. మీరు బందరునేం అభివృద్ధి చేస్తారు..?ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..?'' అని నిలదీశారు. 

''నిన్న బందరు మంత్రి మాట్లాడుతూ అమరావతి లో నీరు, మట్టి, గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు. జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటున్నారు. ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాలి. అమరావతిలో ఉన్న భవనం మీద నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపిస్తారో లేక సన్నాసులం అని ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి'' అని సవాల్ విసిరారు.

''21 నెలల్లో ఎం చేసారు అని అడిగితే.. సంక్షేమ పథకాలు అందించామంటారు.  ఎవడబ్బ సొమ్మని సంక్షేమ పథకాలు ఇస్తారు. జగన్ జేబులో సొమ్మో.. నాని ఇంట్లో సొమ్మో ఇవ్వడం లేదు. ప్యాంట్ జేబులోని డబ్బులు కత్తిరించి షర్ట్ జేబులో పెడుతోంది ఈ ప్రభుత్వం.. అది కూడా సగం కోసేసి. పాదయాత్రలో పెంచుకుంటూ పోతా అన్నాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు'' అని ఎద్దేవా చేశారు.

 ''జగన్ రెడ్డి పిల్లి...పిరికోడు....ఆయనకి మోడీ గారిని చూస్తే వణుకు. సీబీఐ, ఈడీ కాదు ఏకంగా ఇంటర్పోల్ దిగింది. అందుకే స్పెషల్ స్టేటస్ అవుట్, విశాఖ ఉక్కు అవుట్, పోర్టులు అవుట్. మొన్న ఎదో ఊరెళితే ప్రజలు అడిగారట ప్రత్యేకహోదా ఎక్కడ అని? జగన్ రెడ్డి తెచ్చా కదా అన్నారు అట. ఎప్పుడు సార్ అంటే మన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ తెచ్చా కదా అన్నారు అట. స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ ఇలా అబ్బో ఆయన తెచ్చిన కంపెనీలు ఎన్నో. బాబు హయాంలో కియా,హెచ్సిఎల్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో దొంగ లిక్కర్ మాఫియా కంపెనీలు వచ్చాయి'' అని లోకేష్ అన్నారు.

 
 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios