హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్ రెడ్డి, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని నారా లోకేష్ తీవ్రంగా ఖండించాడు.

అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారా అని మండిపడ్డారు. గేటుకి తాళ్లు కట్టారు.. ఇప్పుడు ఏకంగా కారుకు లారీలు అడ్డంగా పెట్టారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేకుండా పోతుందని విరుచుకుపడ్డారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోవడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. లారీలు అడ్డుపెట్టడం కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేడంటూ వ్యాఖ్యానించారు.