మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్. మంత్రి వేధింపుల కారణంగా జయలక్ష్మీ అనే మహిళ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.

బాధ్యత గల మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని లోకేశ్ ప్రశ్నించారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా రాజన్న రాజ్యం.. జగన్ గారూ అంటూ ట్వీట్ చేశారు. దీనితో పాటు సంబంధిత లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.