Asianet News TeluguAsianet News Telugu

Nara Lokesh: "మీడియాపై జగన్ కాలకేయ సైన్యం దాడులు"

Kurnool: కర్నూల్ లోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా చేరుకుని ఆఫీస్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. 

Nara Lokesh , chandrababu condemns attack on Eenadu media office in Kurnool KRJ
Author
First Published Feb 21, 2024, 12:53 AM IST

Kurnool: కర్నూల్ లోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా చేరుకుని ఆఫీస్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం కార్యాలయ తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఈనాడు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.  వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపిస్తూ.. దుండగులు కార్యాలయంపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.  

ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ లను ట్యాగ్ చేశారు. వైసీపీ  ఎమ్మెల్యే అనుచరుల దాడి ప్రజాస్వామికమని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందటే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై అటవిక దాడి జరిగిందని, అతడు తీవ్ర గాయాలపాలయ్యాడని, అదే తరహాలో మంగళవారం కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డారంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో జగన్ తన అనుచరులను రెచ్చగొడుతున్నారనీ, ఈ క్రమంలో మీడియాపైనా, విపక్ష పార్టీలపైనా దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. వీటిని హింసాత్మక చర్యలు అనండి, లేక ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం అనండి...  మరో 50 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడులు చేసి.. ప్రజల్లో భయనక వాతావరణాన్ని స్రుష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనీ, గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ దారుణాలకు పాల్పడుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరోవైపు ఈ దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోందని సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అనంత‌పురం స‌భ‌లో ఆంధ్ర‌జ్యోతి ఫోటోగ్రాఫ‌ర్‌ని అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిందనీ,  ఇప్పుడు ఏకంగా ఈనాడు క‌ర్నూలు కార్యాల‌యంపైకి ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వైకాపా రౌడీమూక‌ల్ని వ‌దిలారని ఆరోపించారు. నిష్ఫాక్షిక స‌మాచారం అందించే ఈనాడు వంటి అగ్ర‌శ్రేణి దిన‌ప‌త్రిక కార్యాల‌యంపై వైకాపా దాడుల‌కు తెగ‌బ‌డ‌డం రాష్ట్రంలో ఆట‌విక పాల‌న‌కి ప‌రాకాష్ట‌ అనీ,  ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభంలాంటి మీడియాపై సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

అలాగే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని విమర్శించారు. విలేకరులపై, మీడియా సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారని మండిపడ్డారు. పత్రికా కార్యాలయంపైనే దాడి జరిగితే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios