Asianet News TeluguAsianet News Telugu

నారా లోకేష్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Nara Lokesh Biography: నారా లోకేష్.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరుది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా గుర్తింపు పొందారు. అలాగే  ఆయన టిడిపి వ్యవస్థాపకులు, దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా. అటు తాత .. ఇటు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. నారా లోకేష్ మొదట వ్యాపార రంగంలో ప్రవేశించి ఆ తరువాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాను . ఈ నేపథ్యంలో నారా లోకేష్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

Nara Lokesh Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 21, 2024, 3:51 AM IST

Nara Lokesh Biography: నారా లోకేష్.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరుది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా గుర్తింపు పొందారు. అలాగే  ఆయన టిడిపి వ్యవస్థాపకులు, దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనవడు కూడా. అటు తాత .. ఇటు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. నారా లోకేష్ మొదట వ్యాపార రంగంలో ప్రవేశించి ఆ తరువాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాను . ఈ నేపథ్యంలో నారా లోకేష్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..

బాల్యం, విద్యాభ్యాసం

నారా లోకేశ్ 1983 జనవరి 23న నారా చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. వీరికి ఉన్న ఏకైక సంతనం లోకేష్ లోకేష్. లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఆ తరువాత  స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసాడు.  లోకేష్ స్కూల్ దశలో ఉన్నప్పుడే తండ్రి ముఖ్యమంత్రి కావడంతో అత్యంత భద్రత మధ్య పాఠశాలకు వెళ్లేవారు.  ఇక క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు.

వ్యక్తిగత జీవితం 

లోకేష్  ఉన్నత చదువులు పూర్తి చేసుకుని  ఇండియాకు తిరిగి వచ్చాక హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు. లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించాయి. అలాగే బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలకపాత్ర పోషించారు. లోకేష్ 2007 ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు, తన మేనమామ బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మిణి వివాహం చేసుకున్నారు. భర్త లోకేష్,  మామ చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలను బ్రాహ్మణి చక్కబెడుతున్నారు. లోకేష్ బ్రహ్మణీ దంపతుల సంతానమే దేవాన్సు.  ఈ చిన్నారి ఫోటో ఇటీవల సోషల్ మీడియా తెగ వైరల్ గా మారాయి.

రాజకీయ జీవితం 

నారా లోకేష్ 2013 నుంచి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. 2009లో టిడిపి మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్ గారిదే. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే పేర్కొన్నాడు. ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు.  లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక విద్యా వైద్య సదుపాయాన్ని అందించారు.  2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేశారు.  

పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత 2017, మార్చి 30న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి ఎన్నికయ్యారు. అనంతరం చంద్రబాబు క్యాబినేట్ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలను తీసుకున్నారు. ఆయన చేపట్టి ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర పోషించారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేశ్ శాసనమండలి సభ్యత్వము 29 మార్చి, 2023న ముగిసింది. 

సంక్షేమ కార్యక్రమాలు 

రాజకీయాల్లోకి రాకముందే లోకేష్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లోని ఒక మెంబర్.  ఈ ట్రస్టు ద్వారా లోకేష్ విద్యా, ఆరోగ్యపరంగా విశేష సేవలు అందించారు. ఎంతమంది పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పించడం కాకా మరెందుకు ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడానికి ఇతర అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలో అందించుటకు ఉపయోగపడే కార్యక్రమంలో రూపొందించారు. గ్రామీణ పట్టణ ప్రజలకు ఈ  ట్రస్ట్ ద్వారానే లోకేష్ మరింత చేరువ అయ్యారు. ట్రస్ట్  కార్యక్రమంలో భాగంగా  బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించారు. ఎంతోమందికి సాయం అందించాడు. 

అవార్డులు

>> 2018 లో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు  

>> బిజినెస్ వరల్డ్ మ్యాగజిన్ డిజిటల్ లీడర్ అవార్డు

>> అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం

>> వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం

 

Follow Us:
Download App:
  • android
  • ios