సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరలు ఒకరి కోసం మరొకరు పుట్టారని వారి పెద్ద అల్లుడు, ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. శనివారం బాలకృష్ణ, వసుంధరల పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఈ దంపతులకు లోకేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

బాలకృష్ణ, వసుంధరల జంటపై లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. మామయ్య బాలకృష్ణ ఎనర్జీకి, విజృంభనకు సంకేతమైతే.. అత్తయ్య వసుంధర.. సహనానికి, శాంతి ప్రతిరూపూపం అంటూ లోకేష్ పేర్కొన్నారు. వీరిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టారంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

బాలకృష్ణ, వసుంధరలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ వివాహం చేసుకోగా.. రెండో కుమార్తె తేజశ్వినిని గీతం విద్యాసంస్థల అధినేత  ఎంవీవీఎస్ మూర్తి  మనవడు భరత్ తో వివాహం జరిగింది. మూడో సంతానం మోక్షజ్ఞ  త్వరలో సినిమాల్లో అరంగేట్రం చేయనున్నారు.