నారా వారి కోడలు నారా బ్రాహ్మణి మెల్లిగా జనాల్లోకి వస్తున్నారు. ఒకపుడు కేవలం హెరిటేజ్ ఫుడ్స్ కి మాత్రమే పరిమితమయ్యేవారు. ఆమె రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని చెబుతున్నా ప్రచారమైతే ఆగటం లేదు. పైగా జరుగుతున్న ప్రచారం కుడా టిడిపి శ్రేణుల నుండే వస్తోంది.
నారా వారి కోడలు నారా బ్రాహ్మణి మెల్లిగా జనాల్లోకి వస్తున్నారు. ఒకపుడు కేవలం హెరిటేజ్ ఫుడ్స్ కి మాత్రమే పరిమితమయ్యేవారు. నారా లోకేష్ ను వివాహం చేసుకున్న తర్వాత కుడా పెద్దగా జనాల్లోకి వచ్చింది లేదు. అయితే, 2019 ఎన్నికల్లో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సరే ఆ విషయం ప్రస్తావించినపుడు ఆమె ఖండించారనుకోండి అది వేరే సంగతి. ఒకవైపు ఆమె రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని చెబుతున్నా ప్రచారమైతే ఆగటం లేదు. పైగా జరుగుతున్న ప్రచారం కుడా టిడిపి శ్రేణుల నుండే వస్తోంది.
అదే సమయంలో హెరిటేజ్ వలయాన్ని దాటుకుని బ్రాహ్మణి మెల్లిగా జనాల్లోకి వస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధంలేని కార్యక్రమాల్లో ఈమధ్య తరచూ కనబడుతున్నారు. మొన్నటి మహిళా సాధికారతపై విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి అందరూ చూసిందే. తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో కుడా కనబడ్డారు. అబూదాబిలో జరిగిన ‘సైమా’ ఫంక్షన్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున తురుపుముక్కగా ప్రచారం చేస్తారని ఒకవైపు, విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్ధానాల్లో ఏదో ఒకదాని నుండి పోటీ చేస్తారని మరోవైపు ప్రచారం ఊపందుకోవటం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
