చంద్రబాబుకు సంఘీభావం తెలిపితే నోటీసులిస్తారా?: నారా భువనేశ్వరి

చంద్రబాబుకు సంఘీభావం తెలిపితే  తప్పేముందని  నారా భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబుకు  మద్దతు తెలిపితే నోటీసులు ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు. 

Nara Bhuvaneswari asks on Police notice to TDP Workers lns

అమరావతి:టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే  తప్పేముందని  నారా భువనేశ్వరి ప్రశ్నించారు.తనకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు.పార్టీ కార్యకర్తలు  తమ బిడ్డల్లాంటి వారని  భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకొంటామని  నోటీసులు ఇస్తారా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.తనను కలవకూడదని  చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదన్నారు.

also read:చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక: ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఏపీ సీఐడీ అధికారులు  ఈ ఏడాది సెప్టెంబర్  9న అరెస్ట్ చేశారు. చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో భాగంగా  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.  దీంతో  నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలు రాజమండ్రిలో ఉంటున్నారు.  చంద్రబాబుకు మద్దతుగా  టీడీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో భువనేశ్వరి  పాల్గొన్నారు.  భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రాజమండ్రికి వస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపే కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసుల నోటీసులను భువనేశ్వరి  సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 

 అయితే  రాజమండ్రికి వచ్చే పార్టీ శ్రేణులపై  పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.  అమరావతి రైతులు  భువనేశ్వరికి మద్దతు తెలిపేందుకు వెళ్లే సమయంలో  పోలీసులు అడ్డుకున్న విషయాన్ని కూడ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios