కుప్పంలో పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అయితే ఈ వ్యాఖ్యలు సరదాకు మాత్రమే చేసినట్టుగా భువనేశ్వరి తేల్చి చెప్పారు.
కుప్పం: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధినేత సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read:రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఇవాళ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాను ఏదో ఒక విషయమై మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతానని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతో 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారన్నారు. ఈ దఫా చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయాలని భావిస్తున్నానని నారా భువనేశ్వరి చెప్పారు. వెంటనే ఈ సభలో ఉన్నవారంతా హర్షంతో చప్పట్లు కొట్టారు. అయితే కుప్పంలో చంద్రబాబు కావాలి కోరుకొనే వారు చేతులు లేపాలని కోరారు. ఈ సభలో పాల్గొన్నవారంతా కూడ చేతులు లేపారు. మరో వైపు తాను పోటీ చేయాలని కోరుకొనే వారు చేతులు లేపాలని కోరారు. అయితే ఈ సభలో పాల్గొన్నవారంతా కూడ చేతులు లేపారు. అయితే ఇద్దరు కావాలని కోరుకుంటే ఎలా.. ఎవరో ఒకరు ఉండాలని భువనేశ్వరి అన్నారు.
also read:మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని
అయితే తాను సరదాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా భువనేశ్వరి ప్రకటించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండడం కంటే సరదాగా ఉండేందుకే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా నారా భువనేశ్వరి వివరించారు. తన భర్త చంద్రబాబు తనను మంచిగా చూసుకుంటాడన్నారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఆమె చెప్పారు. కుప్పం నుండి చంద్రబాబే పోటీ చేస్తాడని భువనేశ్వరి ప్రకటించారు. కంపెనీ వ్యవహరాలతోనే తనకు సరిపోతుందన్నారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పారు.