జిల్లాలో నాని సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ బలముంది. అందుకనే నానిని ఎంఎల్సీగా ఎంపిక చేసినట్లు సమాచారం.

మార్చిలో జరుగనున్న ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల, ఎంఎల్ఏ, స్దానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీల భర్తీకి టిడిపి, వైసీపీ అధినేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శాసనసభ్యుల కోటాలో వైసీపీకి రెండు స్ధానాలు దక్కుతాయి. అందులో ఒకస్ధానం ఆళ్ళ నానికి దక్కినట్లు తెలుస్తోంది. రెండో స్ధానాన్ని ఏ జిల్లాలో ఎవరికి కేటాయించాలనే విషయమై జగన్ ఇంకా కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాని గతంలో రెండుసార్లు ఏలూరు నియోజకవర్గం ఎంఎల్ఏగా గెలిచారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

కాపు సామాజిక వర్గంలో నానికి జిల్లా అంతటా గట్టి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల సమీకరణలే అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో నాని సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ బలముంది. అందుకనే నానిని ఎంఎల్సీగా ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నానిని జిల్లా అంతా ప్రచారం చేయించటం ద్వారా ఎక్కువ లబ్ది పొందాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం స్ధానాలను మిత్రపక్షాలైన టిడిపి, భాజపాలే గెలుచుకున్నాయి.