తమకు మావోయిస్టుల నుంచి ఏ విధమైన హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా తమకు ఏ విషయాలూ చెప్పలేదని నాని అన్నారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు. 

విశాఖపట్నం: తమ నాన్నను మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదని మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే సర్వేశ్వర రావు కుమారుడు నాని అన్నారు. ఆయన తెలుగు టీవీ చానెళ్లతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న నాని విశాఖపట్నం బయలుదేరారు. 

తమకు మావోయిస్టుల నుంచి ఏ విధమైన హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా తమకు ఏ విషయాలూ చెప్పలేదని నాని అన్నారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సంఘటనపై డిజీపి ఇంటలిజెన్స్ వర్గాల నివేదికను కోరారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలకు వెళ్లకూడదని పోలీసులు ఇది వరకే హెచ్చరించారు. అయినా సర్వేశ్వర రావు ఖాతరు చేయలేదని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: ఎస్పీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం