దేశానికి రాష్ట్రపతి, ప్రధానిగా చేసిన వ్యక్తులను పార్లమెంట్‌కు పంపిన నియోజకవర్గంగా నంద్యాలకు పేరు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులు నంద్యాల నుంచే ప్రాతినిథ్యం వహించారు. నంద్యాల రాజకీయాల్లో ప్రతీ పరిణామం క్లైమాక్స్‌లాగే కనిపిస్తుంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ఇక్కడి ఓటర్లకు ప్రత్యేకత వుంది. ముస్లింలు, బలిజలు, వైశ్య ఓటర్లు ఇక్కడ గెలుపొటములను డిసైడ్ చేస్తారు. నంద్యాల లోక్‌సభ పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె , డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1952లో ఏర్పడిన నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 12 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. 

దేశానికి రాష్ట్రపతి, ప్రధానిగా చేసిన వ్యక్తులను పార్లమెంట్‌కు పంపిన నియోజకవర్గంగా నంద్యాలకు పేరు. శ్రీశైలానికి ముఖ ద్వారంగా, నల్లమల అడవులకు పట్టుగొమ్మగా నంద్యాల అలరారుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులు నంద్యాల నుంచే ప్రాతినిథ్యం వహించారు. వీరే కాకుండా మరెందరో ఉద్ధండులను నంద్యాల దేశానికి అందించింది. ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నంద్యాల కేంద్రం. నంద్యాల రాజకీయాల్లో ప్రతీ పరిణామం క్లైమాక్స్‌లాగే కనిపిస్తుంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ఇక్కడి ఓటర్లకు ప్రత్యేకత వుంది. ముస్లింలు, బలిజలు, వైశ్య ఓటర్లు ఇక్కడ గెలుపొటములను డిసైడ్ చేస్తారు. 

నంద్యాల ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. దిగ్గజాలను పార్లమెంట్‌కు పంపిన గడ్డ :

నంద్యాల లోక్‌సభ పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె , డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1952లో ఏర్పడిన నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 12 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,89,790 మంది. వీరిలో పురుషులు 7,58,082 మంది.. మహిళా ఓటర్లు 7,31,652 మంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాలలో 10,63,730 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. 71.40 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాటి లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పోచా బ్రహ్మానందరెడ్డికి 7,20,888 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి మందిర శివానంద రెడ్డికి 4,70,769 .. జనసేన అభ్యర్ధి ఎస్‌పీవై రెడ్డికి 38,871 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 2,50,119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. 

నంద్యాల ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

నంద్యాలలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి వున్నారు. అయితే ఆయనకు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. బ్రహ్మానందరెడ్డి పనితీరుపై ప్రజలతో పాటు స్థానిక వైసీపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో వున్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి.. తన వ్యాపారాలకే ఎంపీ పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం డైలమాలో పడింది.

మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డిల పేర్లను జగన్ పరిశీలిస్తున్నారట. లేనిపక్షంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డినైనా ఎంపీ బరిలో దింపాలన్నది వైసీపీ వ్యూహాంగా తెలుస్తోంది. మైనారిటీ ఓటింగ్ ఎక్కువగా వుండటంతో వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సినీనటుడు అలీ పేర్లు కూడా వైసీపీ అభ్యర్ధి రేసులో వినిపిస్తున్నాయి. 

టీడీపీ విషయానికి వస్తే.. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ నంద్యాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి దాదాపు 25 ఏళ్లు కావొస్తోంది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో వున్న శబరి టీడీపీలో చేరాలని సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. తొలుత బైరెడ్డికే ఇవ్వాలని టీడీపీ భావించగా.. అనూహ్యంగా శబరి పేరు తెరపైకి వచ్చింది.