ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎంఎల్ఏల పిల్లలు కూడా ఏపిలో దౌర్జన్యాలకు దిగుతున్నారా? ఇంతకాలం టిడిపి ఎంఎల్ఏల పిల్లలే అనుకుంటే తాము కూడా వారికి ఏమీ తీసిపోమంటూ ప్రతిపక్ష ఎంఎల్ఏల పిల్లలు కూడా తయారవుతున్నట్లున్నారు. ఇంతకీ విషయమేంటంటే తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో నందికొట్కూరు ఎంఎల్ఏ ఐసయ్య కొడుకు చంద్రమౌళి ఓ వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరీ దౌర్జన్యం చేయటం జిల్లాలో సంచలనంగా మారింది. 10 మంది అనుచరులతో కలిసి పారిశ్రామికవేత్త రమేష్ ఇంటికి వెళ్ళారు. ఇంటి తలుపులు మూసేసి బెదిరింపులకు దిగారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో కూడా చంద్రమౌళి ఫోన్లో డబ్బుల కోసం బెదిరించినట్లు రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.