హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా హిందూపురం చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం మౌన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక, నేడు బాలకృష్ణ హిందూపురం నుంచి అనంతపురంకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అక్కడ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.
హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా హిందూపురం చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం మౌన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. ఎన్నికల ముందు హిందూపురం జిల్లాగా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా వెల్లడించారు. మౌనదీక్ష అనంతరం హిందూపురంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన బాలకృష్ణ పలు అంశాలను ప్రస్తావించారు.
ఇక, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలని కోరుతూ బాలకృష్ణ శనివారం అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేయనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం హిందూపురం నుంచి బయలుదేరారు. అఖిలపక్షం నేతలతో కలిసి భారీ కాన్వాయ్‌తో బాలకృష్ణ అనంతపురంకు పయనమయ్యారు. లేపాక్షి, చిలమత్తూరు, కొడికొండ మీదుగా అనంతపురానికి చేరుకోనున్నారు. అక్కడ కలెక్టర్ కార్యాయానికి చేరుకుని అక్కడ కలెక్టర్‌కు బాలకృష్ణ వినతిపత్రం అందజేయనున్నారు.
ఇక, హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నందమూరి బాలకృష్ణ శుక్రవారం స్థానికంగా మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పట్టణంలోని శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దమని ఎమ్మెల్యే Balakrishna సంచలన ప్రకటన చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్దమా అని బాలకృష్ణ ప్రశ్నించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కన్పించడం లేదన్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. అర్ధరాత్రి జీవోలు జారీ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. తెలుగుదనానికి NTR ఓ సంతకం అని బాలకృష్ణ చెప్పారు.
Kadapa జిల్లాకు YSR పేరు పెడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం ఆ పేరును కొనసాగించిందని బాలకృష్ణ గుర్తు చేశారు. YCP అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఎత్తివేసిందన్నారు.హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్దమేనని ఆయన ప్రకటించారు. హిందూపురానికి మెడికల్ కాలేజీని ఇవ్వాలని తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్టుగా చెప్పారు. కానీ మెడికల్ కాలేజీని పెనుగొండలో ఏర్పాటు చేశారన్నారు. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
