నందమూరి బాలకృష్ణ దాతృత్వం... రూ. 20 లక్షల విలువైన కోవిడ్ కిట్స్ పంపిణీ... (వీడియో)

అనంతపురం: హిందూపురం కోవిడ్  బాధితుల కోసం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్  మందులను  హైదరాబాద్ నుంచి పంపించారు. 
 

nandamuri balakrishna donates rs 20 lakhs worth covid kits to hindupur people -bsb

అనంతపురం: హిందూపురం కోవిడ్  బాధితుల కోసం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్  మందులను  హైదరాబాద్ నుంచి పంపించారు. 

"

హిందూపురంలోని స్థానిక ఎమ్మెల్యే  బాలకృష్ణ  నివాసం వద్ద కోవెడ్  బాధితులు, బంధువులకు తెదేపా నాయకులు కోవెడ్  కిట్స్ ను  అందజేశారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. కేసులు ఓరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ వైరస్‌ పంజా విసురుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల తీవ్రత పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,452 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 13,44,386కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,988కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 6, తూర్పుగోదావరి 9, చిత్తూరు 8, గుంటూరు 8, కర్నూలు 5, నెల్లూరు 8, కృష్ణ 9, ప్రకాశం 4, విశాఖపట్నం 11, శ్రీకాకుళంలో 7, పశ్చిమ గోదావరి 3, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 19,095 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 11,38,028కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 90,750 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,76,05,687కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,97,370 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2185, చిత్తూరు 1908, తూర్పుగోదావరి 2927, గుంటూరు 1836, కడప 1746, కృష్ణ 997, కర్నూలు 1524, నెల్లూరు 1689, ప్రకాశం 1192, శ్రీకాకుళం 1285, విశాఖపట్నం 2238, విజయనగరం 693, పశ్చిమ గోదావరిలలో 1232 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios