మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు: ఆత్మరక్షణలో చంద్రబాబు

Nandamuri Balakrishna calls PM Narendra Modi eunuch, traitor
Highlights

ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముందే ఆయన మోడీని తీవ్ర పదజాలంతో దూషించారు. తన సమక్షంలోనే బాలకృష్ణ మోడీపై చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు.

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముందే ఆయన మోడీని తీవ్ర పదజాలంతో దూషించారు. తన సమక్షంలోనే బాలకృష్ణ మోడీపై చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు.

బాలకృష్ణపై కేసు పెడుతూ చంద్రబాబును సాక్షిగా పెడుతామని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణపై నిరసన వెల్లువెత్తుతోంది. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టిన ఒక్క రోజు దీక్షలో బాలయ్య మోడీపై విరుచుకుపడ్డారు. మోడీని ఆయన శిఖండిగా అభివర్ణించారు. మోడీని తరిమి తరిమి కొడుతామని అన్నారు. "నీకు తెలుగువాళ్ల ఆత్మఘోష వినిపించడం లేదా.. ముందు తెలుగు నేర్చుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం" అని అన్నారు.

సామభేదదండోపాయాలు అంటారు కదా, ప్రస్తుతం చివరి దశలో ఉన్నామని, మోసం చేసిన మోడీని తరిమి తరిమి కొట్టాలని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశమంతా మోడీకి వ్యతిరేకత ఉందని అన్నారు. మోడీ విషయంలో సామభేదదానోపాయాలు అయిపోయాయని, ఇక దండోపాయమే మిగిలి ఉందని, ఇక మీదట యుద్ధమేనని ఆయన అన్నారు. ఇది గుజరాత్ కాదు, ఆంధ్రప్రదేశ్ అని, ఇష్టానుసారం చేస్తే సహించబోమని అన్నారు. 

"తెలుగువాళ్ల ఘోష వినిపించడం లేదా. అయితే ముందు తెలుగు నేర్చుకో. దాంతో పాటు పెద్దలను గౌరవించడం నేర్చుకో. అంతకన్నా ముఖ్యంగా భార్యను ప్రేమించడం తెలుసుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి" అని బాలకృష్ణ ఊగిపోయారు. 

"నిన్ను కొట్టి కొట్టి తరుముతాం.  బంకర్లో దాక్కున్నా కూడా లాక్కొచ్ిచ బాదుతాం. ఒకప్పుడు నీ బిజెపికి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే  ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతలు మానేయ్. ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్న నీవు శిఖండివి" అని ఆయన అన్నారు. 

రాజధాని శంకుస్థాపనను మోడీ మట్టి, పవిత్ర జలాలను తేవడంపై కూడా బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఏం మా వద్ద మట్టీనీళ్లు లేవా అని ప్రశ్నించారు. ఎపి పౌరుడు ఒక్కొక్కరు ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి బిజెపిపై, మోడీపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో బిజెపికి ఎన్టీఆర్, చంద్రబాబు భిక్ష పెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 

loader