ఏబిఎన్ రాధాకృష్ణపై కోర్టు ఆగ్రహం

First Published 14, Nov 2017, 11:53 AM IST
Nampalli court angry on ABN radhakrishna for his absence on  a case
Highlights
  • ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాధాకృష్ణ తదితరులపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పరువునష్టం దావా కేసులో రాధాకృష్ణ  ఈరోజు కోర్టుకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువునష్ట దావా కేసులో రాధాకృష్ణ తదితరులు ఎందుకు కోర్టుకు హాజరుకాలేదో సంజాయిషీ చెప్పాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వచ్చేనెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయమూర్తి కండిషనల్ ఆర్డరు పాస్ చేసారు.

loader