తాను చెప్పిన మాటలను ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబుకు ఏమైనా అనుమానముందా?
చంద్రబాబుకు అనారోగ్యం చేస్తే సమాజానికి సుస్తి చేస్తుందట. అంటే చంద్రబాబు బాధ సమాజానికి బాధ అన్నమాట. అంతేకానీ సమాజబాధ చంద్రబాబు బాధ కాదన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సిఎం మాట్లాడుతూ తాను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పటమేమిటో ఆయనకే అర్ధం కావాలి. అదేవిధంగా, సమాజాన్ని బాగుచేయటం తానొక్కడి వల్లే కాదనే ఎన్టీఆర్ ను పార్టీ పెట్టమని తాను చెప్పానని చెప్పటం గమనార్హం.
ఎన్టీఆర్ కు పార్టీ పెట్టమని తానే సలహా ఇచ్చినట్లు గతంలో కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. మళ్ళీ మళ్ళీ అదే మాటను చెబుతున్నారంటే అర్ధం ఏమిటి? తాను చెప్పిన మాటలను ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబుకు ఏమైనా అనుమానముందా? సిఎం మాటలను బట్టి అలానే అనుకోవాల్సి వస్తోంది. అయితే ఈసారి కొత్తగా మరో విషయం చెప్పారండోయ్. వ్యవస్ధను మార్చటం తన ఒక్కడి వల్లే కాదని ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పారట. తాను కోరితేనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకున్నారు. ఏం చేస్తాం ఏం చెప్పినా అడిగేవారు లేరుకదా?
