చంద్రబాబుపై మండిపడ్డ కెవిపి

చంద్రబాబుపై మండిపడ్డ కెవిపి

చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు విరుచుకుపడ్డారు. చంద్రబాబు తీరు రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారిందని ఓ లేఖలో ధ్వజమెత్తారు. సహజశైలికి భిన్నంగా కెవిపి చంద్రబాబుపై విరుచుకుపడటం గమనార్హం. మామూలుగా అయితే కెవిపి మీడియా ముందుకు పెద్దగా రారు. అటువంటిది రాష్ట్ర విభజన తర్వాత ఏపికి ప్రత్యేకహోదా విషయంలో మాత్రం మాట్లాడుతున్నారు. అయితే, సోమవారం మాత్రం సిఎంకు కెవిపి బహిరంగ లేఖ రాసారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని లేఖలో ఆరోపించారు. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు.  నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారని ధ్వజమెత్తారు.  దోపిడీలో వాటాలు కుదరకే ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారన్నారు. అమరావతి లో శాశ్వత భవనాలకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.  విభజన చట్టం హామీల‌పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.  ఎన్నికలు వచ్చే చివరి నిముషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు.

ఆస్పత్రి ‌పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్‌, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందన్న విషయాన్ని కెవిపి గుర్తుచేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page