అమరావతి నుంచి అనంతపురానికి  25వేల కోట్ల  ఖర్చుతో రాజమార్గం

గుర్రుగా ఉన్న రాయలసీమను మచ్చిక చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి అనంతపురానికి ఒక ఎక్స్ ప్రెస్ రహదారిని నిర్మించేందుకు పూనుకుంటున్నారు.

ముఖ్యమంత్రికి అమరావతి తప్ప రాయలసీమ కనిపించడం లేదని, రాయలసీమలో స్టీల్ పాంటు గురించి మాట్లాడటం లేదు. ఉద్యోగాలొచ్చే పరిశ్రమలు కోస్తాలో, భూములెక్కువ తీసుకుని నామా మాత్రపు ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నారనే విమర్శ కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలలో వుంది.దానికి తోడు అమరావతి విసిరేసినట్లు కోస్తాలో ఉంటుంది, తామిక ముందు ముందు బెంగుళూరు, హైదరాబాద్, ఛెన్నైల మీద అధారపడాల్సిన దుర్గతి కొనసాగుతుందని ఈ ప్రాంతంలో అందోళనవుంది. 

ఇలాంటపుడు, అమరావతి, అనంతపురానికి దూరం కాదని హామీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అమరావతి- అనంతపురం ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

ఈ ప్రాజక్టుకు రూ.27,600 కోట్లఖర్చు అవుతాయని అంచనా.

ఈ ప్రాజెక్టు దేశంలో ఈ తరహా రహదారి నిర్మాణాలలో ట్రెండు సెట్టర్‌గా తయారవుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నా భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని 8 వరుసలకు సరిపడా స్థలాన్ని సేకరిస్తారని ఆయన చెప్పారు. గురువారం మధ్యాహ్నం పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 5 జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ తరువాత అత్యంత ప్రాధాన్యం గల ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియ ఇవాళ్టి నుంచే ఆరంభమైనట్టు ఆయన ప్రకటించారు. రెండేళ్లలో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు.

ఈ ఎక్స్‌ప్రెస్ వేకు సమాంతరంగా రైల్వే ట్రాక్ కూడా నిర్మాణం జరుగుతుందని అది అదనపు ఆకర్షణ అని అన్నారు.