రానున్న ఎన్నికల్లో  ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. మూడున్నర  సంవత్సర కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు. దీంతో ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత బాగానే పెరిగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో  టీడీపీ గెలవడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఆ విషయం టీడీపీ నేతలకు కూడా అర్థమైంది. అందుకే కొత్త వ్యూహ్యాన్ని రచిస్తున్నారు.

 

అందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక ప్రయోజనాన్ని పక్కన పెట్టి ప్రజల వ్యక్తిగత లబ్ధికి పెద్దపీట కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని లబ్ధిదారులందరికి  పక్కా ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులను అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఇటీవల ఇంటింటీకీ తెలుగు దేశం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఆ కార్యక్రమంలో తమకు ఫించను, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు కావాలని టీడీపీ నేతలను డిమాండ్ చేశారు.  దీంతో ఇవి కనుక ప్రజలకు అందజేస్తే.. రానున్న ఎన్నికల్లో తాము సేఫ్ జోన్ లోకి వెళ్లొచ్చు అనే భావన టీడీపీ నేతల్లో కలిగింది.

 

ప్రస్తుతం ఒక ఇంట్లో.. వృద్ధులు, వితంతువులు ఇద్దరూ ఉంటే.. కేవలం ఒకరికి మాత్రమే పింఛను వస్తోంది. అదేవిధంగా ఒక ఇంట్లో వింతతువు, దివ్యాంగులు ఉంటే ఒకరికి మాత్రమే ఫించను వస్తుంది. దీనిని సడలించాలని ప్రజలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఈ విధానాన్ని సడలించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. కొద్ది రోజుల క్రితమే.. వృధ్ధాప్య పింఛను ఖర్చును కేంద్రమే భరించాలని చంద్రబాబు కేంద్రమంత్రి అరుణ్ జైట్టీని కోరారు. ప్రస్తుతం ఉన్న    లబ్ధిదారులకు  ఇవ్వడానికే నిధులు లేవన్న చంద్రబాబు.. ఇప్పుడు ఒక ఇంట్లో లబ్ధిదారులందరికీ ఇస్తానను చెప్పడంలో ఆంతర్యమేమిటి? ఎన్నికల కోసం కాదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికీ రేషన్ కార్డులు లేని వాళ్లు చాలా మందే ఉన్నారు. బోగస్ కార్డుల ఏరివేత లో భాగంగా కొందరి రేషన్ కార్డులను అధికారులు తొలగించారు. వారందరికీ తొరిగి రేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇంటింటికీ మంచి నీటి కులాయిలు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. మూడున్నర ఏళ్లలో చేయని పనులన్నింటినీ.. కేవలం ఏడాది కాలంలో చేయాలని చంద్రబాబు.. అధికారులను ఆదేశిస్తున్నారట. ఇదంతా చంద్రబాబు ఎన్నికల వ్యూమేనని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు.