‘తెలుగుదేశంపార్టీ శాశ్వతంగా అధికారంలో కొనసాగాలి’...తాజాగా చంద్రబాబనాయుడు చేసిన వ్యాఖ్యలు. టిడిపికి శాశ్వత అధికారం తన కోసం కాదట, ప్రజల కోసమేనట. ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం అధికారంలోకి రావాలని అనుకోకూడదట. కానీ చంద్రబాబు మాత్రం శాశ్వతంగా అధికారంలో ఉండాలని అనుకోవచ్చు.
‘తెలుగుదేశంపార్టీ శాశ్వతంగా అధికారంలో కొనసాగాలి’...తాజాగా చంద్రబాబనాయుడు చేసిన వ్యాఖ్యలు. గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, 2019లోనే కాదట, ఎప్పటికీ టిడిపినే అధికారంలో ఉండాలని కోరుకున్నారు. దానికి కారణం కూడా చెప్పారండోయ్. టిడిపికి శాశ్వత అధికారం తన కోసం కాదట, ప్రజల కోసమేనట. ఎలాగుంది చంద్రన్న కొత్త భాష్యం.
వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటేనేమో జగన్ ది అధికార కాంక్షగా తమ్ముళ్ళు అంతెత్తున లేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం అధికారంలోకి రావాలని అనుకోకూడదట. కానీ చంద్రబాబు మాత్రం శాశ్వతంగా అధికారంలో ఉండాలని అనుకోవచ్చు.
టిడిపి శాశ్వతంగా అధికారంలో ఉండి, అధికారయంత్రాంగం బలంగా ఉంటే సామాన్య ప్రజానీకానికి లాభమన్న కొత్త విషయాన్ని కుడా చెప్పారు చంద్రబాబు. టిడిపి అధికారంలో ఉంటేనే అధికార యంత్రాంగం బలంగా ఉంటుందా? విచిత్రంగా లేదు చంద్రబాబు మాటలు. ఇపుడుమాత్రం అధికార యంత్రాంగం ఏమంతా బలంగా ఉందని? టిడిపి చేతిలో కీలుబొమ్మలాగ ఆడటం లేదా?
నిజంగానే యంత్రాంగం అంత బలంగా ఉంటే తమ్ముళ్ళు ఎంతమంది అధికారులపై దాడులు చేస్తున్నా యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతోంది? ప్రజలు కూడా ఇతరులకు అధికారం అప్పగించాలని ఆలోచించకూడదట.
80 శాతం ప్రజలు తన పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారట. 80 శాతం రాజకీయ ఏకీకరణ జరగాలని ఆకాంక్షించారట. సుస్ధిరప్రభుత్వం ఉంటే పెట్టుబడులు వస్తాయని కూడా అన్నారు. పెట్టుబడుల కోసమే అనేక దేశాలు తిరిగారు. రెండుసార్లు అంతర్జాతీయ స్ధాయిలో భాగస్వామ్య సదస్సు కుడా నిర్వహించారు. ఏమేరకు పెట్టుబడులు వచ్చాయంటే మాత్రం సమాధానం చెప్పరు. సరే, అధికారంలో ఉన్నారు, అందులోనూ నంద్యాలలో గెలిచారు కాబట్టి చంద్రబాబు ఎన్ననైనా మాట్లాడుతారు. అధికారంలో ఎవరుండాలో తేల్చాల్సింది అంతిమంగా ప్రజలే కదా?
