‘తప్పు చేసిన వారు ‘ఎవరైనా సరే’ తప్పించుకోలేరు’ అన్న మాట జగన్ కు మాత్రమే వర్తిస్తుందా లేక అందరికీనా? అన్నది తేలాలి. ఎందుకంటే, చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్ తప్పు చేసారు కాబట్టి జగన్ కు శిక్ష తప్పదు. మరి, ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్నదెవరు?

ఏ సందర్భంలో చెప్పినా, చంద్రబాబు కొన్ని నిజాలు చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో శనివారం రైతులనుద్దేశించి మాట్లాడుతూ, సరే, ఎవరిని ఉద్దేశించి చెప్పారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, చంద్రబాబైనా, మొత్తం టిడిపి అయినా లక్ష్యంగా చేసుకున్నది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే అన్న విషయం చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారు.

జగన్-ప్రధాని భేటీ గురించి మళ్ళీ ప్రస్తావించారు. ఒకటికి పదిసార్లు ఒకే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్ధం కావటం లేదు. అదే సమయంలో చంద్రబాబు చెప్పిన నిజాలేంటంటే, ‘తప్పు చేసిన వారు ‘ఎవరైనా సరే’ తప్పించుకోలేరు’ అన్న మాట జగన్ కు మాత్రమే వర్తిస్తుందా లేక అందరికీనా? అన్నది తేలాలి.

ఎందుకంటే, చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్ తప్పు చేసారు కాబట్టి జగన్ కు శిక్ష తప్పదు. మరి, ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్నదెవరు? అప్పటికే సుమారు 18 కేసుల్లో ఇరుక్కుని వాటిపై విచారణ జరగకుండా ఇప్పటికీ స్టేలపై కొనసాగుతున్నదెవరు? వాటిల్లో ఏ ఒక్క కేసులో విచారణ జరిగినా తప్పు చేసిందెవరో ఎప్పుడో తేలిపోయేది.

1-అక్రమంగా సంపాదించిన వాళ్ళకు నిద్రపట్టదట: తనకు నిద్రపట్టటం లేదని రోజుకు 18 గంటలు మెలకువగానే ఉంటున్నట్లు జగన్ ఏనాడైనా ఎక్కడైనా చెప్పారా? సిఎం రోజుకు 4, 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని చెప్పిందెవరు? సిఎంకు ఎందుకు కంటినిండా నిద్రపట్టటం లేదు?

2-అలా సంపాదించి జైలుకు వెళ్ళటంకంటే నిజాయితీగా బతకటం మంచిది: జగన్ జైలుకు ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చింది? కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాతే కదా? అదికూడా కాంగ్రెస్ నేత శంకర్ రావు, టిడిపి నేత యర్రన్నాయడు ఇద్దరూ జగన్ పై కేసులు వేయటం నిజం కాదా? చట్టవిరుద్దంగా జగన్ను 16 మాసాలు జైలులో పెట్టింది వాస్తవం కాదా? జగన్ పై పెట్టిన కేసులు ఒక్కోటి వీగిపోతున్నది నిజం కాదా?

3-అవినీతికి మనశ్శాంతి ఉండదు: జగనేమన్నా తనకు మనశ్శాంతి కరువైందని ఎప్పుడైనా చెప్పారా? మనశ్శాంతి కరువయ్యే 24 గంటలూ జగన్ గురించే మాట్లాడుతున్నదెవరు?

4-ఎంతటివారైనా సరే తప్పులు చేస్తే తప్పించుకోలేరు: ఆ విషయం ఇప్పటికే పివి నరసింహారావు, ఎల్ కె అద్వానీ, లాలూ ప్రసాద్ యాదవ్, మురళీ మనోహర్ జోషి, జయలలిత, శశికళ తదితతరుల విషయంలో రుజువైంది. ఇక రుజువవ్వాల్సింది మన రాష్ట్రం విషయంలోనే.